ఏడాదికి 100 కోట్ల టీకా డోసులు: చైనా

26 Sep, 2020 07:57 IST|Sakshi

బీజింగ్‌: ఏడాదికి 100 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ప్రతినిధి జెంగ్‌ జోంగ్‌వీ శుక్రవారం చెప్పారు. వచ్చే ఏడాది నాటికి ఈ మేరకు ఉత్పత్తి సామర్థ్యం సాధిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తమ ఉత్పత్తి సామర్థ్యం 61 కోట్ల డోసులకు చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.  (దక్షిణ కొరియాకు సారీ చెప్పిన కిమ్‌)

కరోనా వ్యాక్సిన్‌ డోసుల తయారీకి చైనా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. 2021లో 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయడమే తమ ధ్యేయమని ఫార్మా దిగ్గజ సంస్థలు ఫైజర్, మోడెర్నా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీకా డోసులను తొలుత ఆరోగ్య కార్యకర్తలు, సైనికులకు, వృద్ధులకు అందజేస్తామని జెంగ్‌ జోంగ్‌వీ పేర్కొన్నారు.   (కశ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపించండి!)

మరిన్ని వార్తలు