చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ

18 Dec, 2020 11:19 IST|Sakshi

మయన్మార్‌ సరిహద్దులో 2000 కిమీ ముళ్ల గోడ

మయన్మార్‌ ఆక్రమణే చైనా ఉద్దేశం: అమెరికా

బీజింగ్‌: ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్‌ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని.. అతిపెద్ద దేశంగా అవతరించడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం చైనా ఎన్ని కుయుక్తులయినా పన్నుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా మరో దుశ్చర్యకు దిగింది. మయన్మార్‌ సరిహద్దులో ఏకంగా 2000 వేల కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణాన్ని తలపెట్టింది. అక్రమంగా దేశంలో ప్రవేశించే వారిని నివారించడానికే ఈ గోడ నిర్మాణం చేపడుతన్నట్లు చైనా చెప్తుండగా.. మయన్మార్‌ ఆక్రమణే డ్రాగన్‌ ప్రధాన ఉద్దేశం అని అమెరికా అత్యున్నత టింక్‌టాక్‌ వెల్లడించింది. వివరాలు.. చైనా తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట 2000 కిలోమీటర్ల పొడవైన ముళ్ల గోడను నిర్మించే పనిలో ఉంది. నివేదికల ప్రకారం, మయన్మార్ సైన్యం తన సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైనా తన వైఖరిని మార్చుకోవడం లేదని సమాచారం. (చదవండి: పరాక్రమంతో తిప్పికొట్టాం)

మయన్మార్ సరిహద్దు వెంట చైనా చేపట్టిన గోడ నిర్మాణంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చేసిన ప్రయత్నం దాని విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని, రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో సంఘర్షణ గణనీయంగా పెరుగుతుందని ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ తెలిపింది. చైనా ప్రభుత్వం మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ (గ్లోబల్ టైమ్స్) ప్రకారం మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లను అరికట్టడం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది. చైనా నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో‌ 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఈ గోడను నిర్మిస్తుంది. అసమ్మతివాదులు చైనా నుంచి తప్పించుకోకుండా చూడటం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆర్‌ఎఫ్‌ఏ నివేదిక వెల్లడించింది. (సర్జికల్‌ స్ట్రైక్‌ చేయండి: సంజయ్‌ రౌత్‌)

చైనా చర్యలను మయన్మార్ సైన్యం నిరంతరం వ్యతిరేకిస్తోంది. తమ దేశ సరిహద్దు వెంబడి ముళ్ల తీగను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో మయన్మార్‌ సైన్యం చైనా అధికారులకు ఒక లేఖ రాసింది. అంతేకాక ఈ లేఖలో 1961 సరిహద్దు ఒప్పందం గురించి ప్రస్తావించింది. దాని ప్రకారం సరిహద్దుకు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టికూడదని ఒప్పందంలో ఉందని మయన్మార్‌ లేఖలో గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు