5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి

17 Jan, 2021 05:49 IST|Sakshi
యుద్ధప్రాతిపదికన ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

హెబెయ్‌ ప్రావిన్స్‌లో నిర్మించిన చైనా

బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్‌ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్‌ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్‌ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్‌ నగరంలో కోటి కరోనా వైరస్‌ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది.

మరిన్ని వార్తలు