భారత వైద్యుడికి చైనా నివాళి!

12 Oct, 2020 09:52 IST|Sakshi

బీజింగ్‌: భారత సంతతి వైద్యుడు ద్వారకానాథ్‌ కోట్నిస్‌కు చైనా ప్రభుత్వం నివాళులు అర్పించింది. భారత్‌-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రితక్తలు నెలకొన్న ఈ నేపథ్యంలో ఒక భారత వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ప్రముఖ్యతను సంతరించుకుంది.  చైనా, జపాన్ దేశాల మధ్య 1938లో జరిగిన యుద్ధ సమయంలో చైనా సైనికులకు వైద్య సాయం అందించారు భారతదేశానికి చెందని వైద్యుడు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్‌. రెండో ప్రపంచ యుద్దు సమయంలోనూ చైనాకు సేవలు అందించారు.

అప్పట్లో చైనా సైనికులకు సాయం అందించేందుకు భారత్ నుంచి ఐదుగురు వైద్యల బృందం వె‍ళ్లింది. వారిలో కోట్నిస్ ఒకరు. యుద్ధం అనంతరం నలుగురు వైద్యులు తిరిగి భారత్‌కు వచ్చేయగా కోట్నిస్ మాత్రం చైనాలోనే ఉండిపోయారు. తరువాత కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. మావో చేపట్టిన చైనా ఉద్యమంలో కూడా ఆయన పాలుపంచుకున​న్నారు. 35 ఏళ్ల వయసులో1942లో అక్కడే మరణించారు. అనంతరం కోట్నిస్ సేవలను గుర్తించిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తోంది. ఆయన 110వ జయంతి సందర్భంగా చైనా నివాళులర్పించింది. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులు డాక్టర్ కోట్నిస్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. 

చదవండి: చర్చలతో చైనా దారికి రాదు

మరిన్ని వార్తలు