బైడెన్‌ విజయం: మౌనం వీడిన చైనా

13 Nov, 2020 20:16 IST|Sakshi

బీజింగ్ ‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపుపై ఇన్నిరోజులుగా నిశ్శబ్దం ఉన్న చైనా ఎట్టకేలకు మౌనం వీడింది. ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌, కమలా హ్యారీస్‌లకు అభినందనలు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ బెంగ్‌ మాట్లాడుతూ.. ‘అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం అని అన్నారు. గత రెండేళ్లుగా చైనా -అమెరికా విభేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రాగన్‌ నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించడం  ‌మరింత వివాదంగా మారింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనా బైడెన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెళ్తువెత్తుతున్నా.. చైనాతో పాటు, రష్యా, మెక్సికో దేశాలు మౌనంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు శుక్రవారం బీజింగ్‌ స్పందించింది. బైడెన్‌ నాయకత్వంలో గతంలో దెబ్బతిన్న ఇరుదేశాల మైత్రిని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి  వాంగ్‌ బెంగ్‌ తెలిపారు.

ఐయామ్‌ నాట్‌ లూసర్‌: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంత వరకు తన ఓటమిని అంగీకరీస్తూ ప్రకటన చేయలేదు. ఎన్నికలలో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుని ఆశ్రయించినప్పటికీ, అమెరికా మిత్రదేశాల నుంచి బైడెన్‌కి వస్తున్నా అభినందనలు ఆగడం లేదు. అమెరికా అధికారుల అభిప్రాయం ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాతో చైనా సంబంధాలు హీన స్థితిలో ఉన్నాయి. ఇవి ట్రంప్‌ పాలనలో కన్నా బైడెన్‌ పాలనలో కొంత మెరుగవ్వవచ్చు. కానీ బైడెన్‌ తన ఎన్నికల ప్రచారంలో చైనా గొప్ప వ్యూహాత్మక ప్రణాళికతో అమెరికా దాని మిత్ర పక్షాలకు సవాలు విసురుతోందని పేర్కొన్నారు. అదే విధంగా చైనా అధ్యక్షుడిని దొంగతో పోల్చారు.

మరిన్ని వార్తలు