భారత్‌, అమెరికాకు షాకిచ్చిన చైనా.. ఇంకా ఎన్నిసార్లు..?

17 Jun, 2022 16:51 IST|Sakshi

భారత్‌, అమెరికాకు డ్రాగన్‌ కంట్రీ చైనా మరోసారి బిగ్‌ షాకిచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీ విషయంలో చివరి నిమిషంలో చైనా ట్విస్ట్‌ ఇచ్చింది. అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కిని గ్లోబ‌ల్ టెర్ర‌రిస్ట్‌గా ప్ర‌క‌టించాల‌ని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్ర‌తిపాద‌న‌ను చైనా అడ్డుకున్న‌ది. 

అయితే, అంతకుముందు.. ఇండియా, అమెరికా దేశాలు.. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలోని ఐసిస్‌, ఆల్ ఖైయిదా ఆంక్ష‌ల క‌మిటీ కింద ఉగ్ర‌వాది మ‌క్కిని గ్లోబ‌ల్ టెర్రరిస్ట్‌గా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌తిపాద‌న చేశాయి. కాగా, సెప్టెంబ‌ర్ 26 దాడుల‌కు పాల్ప‌డిన ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌ సోదరుడే మ‌క్కి. ఇక, మ‌క్కిని ప్ర‌త్యేక‌మైన గ్లోబ‌ల్ టెర్ర‌రిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజ‌రీ శాఖ 2010 న‌వంబ‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేసింది. దాని ప్ర‌కారం మ‌క్కీ ఆస్తుల్ని సీజ్ చేశారు. మ‌క్కి త‌ల‌పై రెండు మిలియ‌న్ల డాల‌ర్ల రివార్డును కూడా అమెరికా ప్ర‌క‌టించింది. 

ఇదిలా ఉండగా.. తాజాగా మక్కీని గ్లోబ‌ల్ టెర్రరిస్ట్‌గా ప్ర‌క‌టించాల‌ని ప్రతిపాదనను డ్రాగెన్‌ చైనా అడ్డుకుంది. ఇక, గ‌తంలోనూ పాక్ ఉగ్ర‌వాదుల‌ను నిషేధిత జాబితాలో చేర్చుతున్న స‌మ‌యంలో ఆ ప్ర‌య‌త్నాల‌ను చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే. మరోవైపు.. ల‌ష్క‌రే సంస్థ కోసం మక్కీ నిధులను స‌మీక‌రించిన‌ట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్‌

మరిన్ని వార్తలు