భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా

28 Sep, 2021 07:36 IST|Sakshi

బీజింగ్‌: భారతీయులకు వీసాల నిరాకరణను డ్రాగన్‌ దేశం చైనా సమర్థించుకుంది. కరోనా కారణంగా చైనా నుంచి భారత్‌ చేరుకున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులను తిరిగి తమ దేశంలోకి రానివ్వకుండా ఇటీవల చైనా వీసా నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిశ్రి ఈ నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా నిర్ణయం నిరాశ కలిగించిందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలోవ్యాఖ్యానించారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ స్పందించారు.  చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో)

కరోనా వ్యాప్తి నిరోధించేందుకు తాము శాస్త్రీయమైన, అవసరమైన మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు. కేవలం భారతీయుల మీదనే తాము ఆంక్షలు పెట్టలేదని, భారత్‌లో ఉన్న తమ సొంత పౌరుల మీద కూడా ఆంక్షలు పెట్టామని అన్నారు. తాము అందరికీ సమానమైన క్వారంటైన్‌ నియమాలనే పెట్టామని అందులో భాగంగానే భారత్‌పై కూడా నిబంధనలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.     చదవండి: (సైబర్‌ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌ రేప్‌)

మరిన్ని వార్తలు