బాబోయ్‌.. 28 గంటల్లో 10 అంతస్తులు కట్టేశారు

11 Jul, 2021 20:51 IST|Sakshi

బీజింగ్‌: మానవ మేధస్సు ఎప్పటికప్పుడు ప్రకృతితో పోటీపడడం సరే.. తనతోతాను కూడా పోటీపడుతోంది. ఈరోజు ఓ అద్భుతాన్ని సృష్టిస్తే మరుసటిరోజుకే దాన్ని అప్‌డేట్‌ చేస్తోంది. ఇలా మనిషి మెదడులో మెరిసిన గమ్మత్తుకి ఈసారి చైనాలోని చాంగ్షా అనే ప్రాంతం సాక్ష్యంగా నిలింది. పేకలు పేర్చినట్టుగా మేడలోని అంతస్తులు, అందులోని గదులను పేర్చి. ఇల్లు కట్టాలంటే నెలలు.. భారీ భవనాలైతే సంవత్సరాలు పట్టడం సర్వసాధారణం.

పునాదులు, పిల్లర్లు, స్లాబ్, గోడలు, ప్లాస్టరింగ్, తలుపులు, కిటికీలు, రంగులు.. హమ్మయ్య ఇంత పని ఇల్లంటే!  అలాంటిది చైనాలోని చాంగ్షాలో 28 గంటల్లో 10 అంతస్తుల భవనాన్ని కట్టి చరిత్ర సృష్టింంది బ్రాడ్‌ గ్రూప్‌ అనే సంస్థ. ఇది ఎలా సాధ్యమైందంటే.. ఆ భవన నిర్మాణానికి కావాల్సిన లిఫ్ట్‌ దగ్గర నుంచి పిల్లర్లు, గదులు, గుమ్మాలు, బాత్‌రమ్‌లు, అల్మారాలు, ఇంటీరియర్లు.. ఇలా ఆ బిల్డింగ్‌కు కావల్సిన సమస్తాన్నీ ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చేశారు ఫోల్డ్‌ అయ్యే విధంగా. ట్రక్కుల్లో వాటిని  నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లారు. తర్వాత పెద్దపెద్ద క్రేన్ల సాయంతో ఒకదానిపై ఒకటి పేర్చుతూ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు