తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..

20 Oct, 2021 16:20 IST|Sakshi

బీజింగ్: పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మొదటగా వాళ్ల తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదన్న మాటే వినిపిస్తుంది. ఎందుకgటే పిల్లల మనస్తత్వం ఎలా ఉన్నా అంతెందుకు వాళ్లు చెడు మార్గంలో పయనించిన, లేదా ఉన్నత స్థాయికి ఎదిగినా ఆ క్రెడిట్‌ మొత్తం తల్లిదండ్రులకే దుక్కతుంది. ఇది సర్వ సాధారణం. అయితే ఇవి ఇప్పటివరకు మాటల వరకే పరిమితంగా ఉండేవి కానీ వీటినే చట్టంగా మార్చి శిక్ష కూడా వేస్తామంటోంది చైనా ప్రభుత్వం.

చైనా  తీసుకువస్తున్న ఈ చట్ట ప్రకారం.. పిల్లలు తప్పు చేస్తే.. ఇక నుంచి వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారట. అందుకోసం చైనాలో సరికొత్త చట్టం రూపొందుతోంది. ఆ చట్టం ప్రకారం.. పిల్లల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నా, వాళ్లలో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బిల్లును చైనా ప్రభుత్వం రివ్యూ కూడా చేస్తోంది.

ఈ చట్టం ఏం చెప్తోందంటే..
తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి తెలియజేయడంతో పాటు ఆచరించేలా ప్రోత్సాహించాలి. చట్టాల మీద అవగాహన కూడా తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ రకంగా పాజిటివ్ ఆటిట్యూడ్ను పెంపొం‍దించేలా చర్యలు తీసుకోవాలిని ఆ బిల్లులో పేర్కొంది. ఆ దేశ పిల్లలు ఇటీవల ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనంగా మారడంతో గత కొన్ని నెలలుగా, చైనా విద్యా మంత్రిత్వశాఖ మైనర్లకు పరిమిత గేమింగ్ గంటలను మాత్రమే వీలు కల్పించింది. దీని ప్రకారం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి మాత్రమే వీలుంటుంది.

చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..

మరిన్ని వార్తలు