చైనాలో ఏదైనా డిఫరెంటే.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ చూస్తే వణుకు తప్పదు!

5 Nov, 2022 20:04 IST|Sakshi

ఏదైనా వాహనం నడిపేందుకు ప్రతీ వాహనదారుడికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కచ్చితంగా ఉండాల్సిందే. లేనిపక్షంలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే జరిమానా అయినా కట్టాలి.. ఒక్కోసారి జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక, మన దేశంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎలా సాధించాలో దానికి సంబంధించిన టెస్టు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక, విదేశాల్లో డ్రైవింగ్‌ టెస్టు ఎలా ఉంటుందో చూస్తే ఒక్కసారిగా షాక్‌ అవుతారు. 

ఇక, తాజాగా డ్రాగన్‌ కంట్రీ చైనాలో డ్రైవింగ్‌ టెస్టు చూస్తే నిలుచున్న చోటే కాళ్లకు వణుకు వస్తుంది. అంత కఠినంగా ఉంటుంది టెస్ట్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోలో పాము కన్నా ఎక్కువ వంకరలు తిరిగిన రెండు లైన్లలో వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో 8 ఆకారం ఉన్న లైన్లలో వాహనం లైన్‌కు టచ్‌ కాకుండా బయటకు వెళ్లాలి. అనంతరం.. డ్రైవర్ కారును రివర్స్‌లో పార్క్ చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో కారు టైర్‌ ఏ మాత్రం లైన్‌కు తాకినా టెస్ట్‌ ఫెయిల్‌ అయినట్టుగా అధికారులు గుర్తిస్తారు. 

కాగా, చైనాలో డ్రైవింగ్‌ టెస్టుకు సంబంధించిన వీడియోను తన్సు యెగెన్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నట్టు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, కొందరు నెటిజన్లు మాత్రం ఇతరు దేశాలకు చెందిన డ్రైవింగ్‌ టెస్టులకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తుండటం విశేషం. 

మరిన్ని వార్తలు