చైనాలో తీవ్ర భూకంపం, 46 మంది మృతి.. ఫోటోలు, వీడియోలు వైరల్‌

6 Sep, 2022 06:59 IST|Sakshi

బీజింగ్‌: చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ లుడింగ్‌ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంతో 46 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్‌ సరఫరా, రవాణ, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్‌ ఆంక్షలతో ఈ ప్రావిన్స్‌ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. చైనాలో భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


చదవండి: UK PM Election Results 2022: బ్రిటన్‌ పీఠం ట్రస్‌దే

మరిన్ని వార్తలు