పాపం ఈ ఆలీబాబాకు మరో షాక్‌!

10 Apr, 2021 16:15 IST|Sakshi

బీజింగ్‌: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఏ ముహుర్తంలో చైనా ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారో,ఇక అప్పటి నుంచి ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది డ్రాగన్‌ సర్కార్‌. ఈ క్రమంలో జాక్‌ మాను, ఆయన సంస్థలను కష్టాలు వదలక వెంటాడుతూనే ఉన్నాయి.  తాజాగా జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆ సంస్థపై మరో బాంబ్‌ పేల్చింది. మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించారంటూ జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది‌.

‘పిక్‌ వన్‌ ఫ్రమ్‌ టూ’ అనే నినాదంతో దేశీయ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్లో పోటీని పరిమితం చేస్తూ అలీబాబా గ్రూప్‌ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తోందంటూ చైనా మార్కెట్‌ రెగ్యులేషన్‌ ఆరోపించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 2.8బిలియన్‌ డాలర్లు జరిమానా విధించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో 4 శాతానికి సమానం కావడం గమనార్హం.

కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో  జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనా ప్రభుత్వం యాంట్‌ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఇవేకాక గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది.దాని ఫలితంగానే తాజా ఈ జరిమానాను జాక్‌ మా పై విధించింది. 

( చదవండి: వైరల్‌: బ్రూస్‌లీ వన్‌ ఇంచ్‌ పంచ్‌తో అదరగొడుతున్న యువకుడు

మరిన్ని వార్తలు