మ్యూజిక్‌ కోసం అబ్బాయి అవతారం.. ట్విస్ట్‌ ఏంటంటే..

16 Oct, 2021 11:30 IST|Sakshi

మ్యూజిక్‌ అంటే ఇష్టంతో ఓ బాలిక.. అబ్బాయిగా అవతారం ఎత్తింది. చైనాకు చెందిన 13 ఏళ్ల ఫు జియువాన్ అనే బాలిక.. అబ్బాయిగా ప్రముఖ యూఎన్‌జీ యూత్ క్లబ్‌ సంస్థ మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరింది. అయితే బ్యాండ్‌ ట్రైనింగ్‌లో భాగంలో పలు వీడియో పర్ఫార్మేన్స్‌లను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. దీంతో ఫు జియువాన్‌ అబ్బాయి కాదని.. బాలిక అని యూఎన్‌జీ యూత్‌ క్లబ్‌ అభిమానులు, నెటిజన్లు గుర్తించారు. అయితే ఈ విషయంపై ఫు జియువాన్‌ స్పందించింది.

‘మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి నన్ను క్షమిచండి. ఇక నేను భవిష్యత్తులో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోగాని, వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో గాని కనిపించను’ అని తెలిపింది. అయితే ఈ విషయంపై యూఎన్‌జీ యూత్ క్లబ్‌ ప్రతినిధి స్పందిస్తూ.. యూఎన్‌జీ క్లబ్‌ కేవలం 11 నుంచి 13 ఏళ్ల అబ్బాలను మాత్రమే చేర్చుకుంటుదని తెలిపారు. వారికి మ్యూజిక్‌, డ్యాన్స్‌లపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ను సరిగా చేయకపోవటం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. ఇటువంటి తప్పులు మళ్లీ జరగవని తెలిపారు. చైనాలో ఈ బ్యాండ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మ్యూజిక్‌, డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు ఇందులో చేరి శిక్షణ పొంది ఫేమస్‌ కావాలని ఆశపడుతుంటారు. మ్యూజిక్‌పై ప్రేమతో ఆమె చేసిన ధైర్యాన్ని అభిమానులు కొందరు ప్రశంస్తున్నారు. యూఎన్‌జీ క్లబ్‌ లాభాలు పొందాలనే ఇలా చేస్తోందని విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు