'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు సెలవులు మంజూరు

2 Apr, 2023 09:31 IST|Sakshi

చైనా ఎప్పుడూ దూకుడుగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజగా మరో వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవటంతో.. పెంచే దిశగా రకరకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకోసం ప్రజలను ప్రోత్సహించేలా చైనా చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగా ప్రస్తుతం 'ప్రేమలో పడండి" అంటూ విద్యార్థులకు సెలవులు కూడా మంజూరు చేసింది. ఈ మేరకు చైనాలో తొమ్మిది కళాశాలల్లోని విద్యార్థులను 'ప్రేమలో పడండి" అంటూ ఏప్రిల్‌ నెలలో వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం.

చైనా స్థానికి మీడియా ప్రకారం...ఫ్యాన​ మీయి ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ నిర్వహిస్తున్న మిన్యాంగ్‌ ప్లయింగ్‌ వొకేషనల్‌ కాలేజ్‌ మొదటి మార్చి 21 నుంచి వసంత విరామాన్ని ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ..జీవితాన్ని ‍ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోండి అని విద్యార్థులను ప్రొత్సహిస్తోంది చైనా. జనన రేటును పెంచడంలో భాగంగా చేస్తున్న ప్రయత్నం అని చెబుతుండటం విశేషం. అదీగాక జనన రేటును పెంచడానికి ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. ఐతే నిపుణలు జనాబా క్షీణతను తగ్గించే ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ..ఇదోక ప్రయత్నంగా తెరమీదకు తీసుకువచ్చి అమలు చేశారు.

వాస్తవానికి 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం చైనాను తన గుంత తనే తవ్వుకునేలా చేసింది. కరోనా మహమ్మారి తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా చైనాలో ఒక్కసారిగా జననాల రేటు ఘోరంగా పడిపోయింది. దీంతో చైనా జనాభాను పెంచేందుకు రకరకాలుగా యత్నిస్తున్నా.. అందుకు ప్రజలు సుముఖంగా లేరు. ఎందుకంటే ఎక్కవ మంది పిల్లల కారణంగా వారి సంరక్షణ, విద్యకు సరిపడే ఆదాయం లేకపోవడంతో విముఖత చూపిస్తున్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీలు కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా..ప్రజల నుంచి సానూకూల స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో నిపుణులు జనాభా క్షీణతను నియంత్రించేలా ఇలా వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. 

(చదవండి: గాల్లో ఉండగానే హాట్‌​ ఎయిర్‌ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..)

మరిన్ని వార్తలు