జనాభా నియంత్రణలో చైనా సడలింపులు

31 May, 2021 17:30 IST|Sakshi

సంతానం విషయంలో నిబంధన సడలింపు

1950 నుంచి జనాభా నియంత్రణ అమలు

సడలింపులు ఇచ్చినా కనిపించని ఫలితాలు

బీజింగ్‌: జనాభా నియంత్రణ విషయంలో చైనా ప్రభుత్వం దశాబ్ధాల తరబడి అమలు చేసిన పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై చైనాలో ముగ్గురు పిల్లలను కనేందుకు దంపతులకు అనుమతి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

2016లో
వందల ఏళ్లు అధిక జనాభాతో ఇబ్బందులు పడింది చైనా. దీంతో 1950వ దశకం నుంచి జనాభా నియంత్రణపై కఠిన నిబంధనలు విధించింది. అందుకు తగ్గట్టే సత్ఫలితాలు కూడా సాధించింది. అయితే రానురాను యువ జనాభా తగ్గిపోయి వృద్ధ జనాభా దేశంలో ఎక్కువైంది. ఈ క్రమంలో మానవ వనరుల కొరత ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. దీంతో దాదాపు అరవై ఏళ్ల తర్వాత తొలిసారి జనాభా నియంత్రణ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించింది కమ్యూనిస్టు ప్రభుత్వం. దీంతో ఇద్దరు పిల్లలు కనేందుకు 2016లో అనుమతి ఇచ్చింది.

మారని తీరు
దాదాపు యాభై ఏళ్ల పాటు జనాభా నియంత్రణ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో చైనీయుల్లో ఎక్కువ మంది జనాభా నియంత్రణకే అలవాటు పడిపోయారు. 2016లో ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతి వచ్చినా.. పెద్దగా ప్రయోజం లేదు. 2020 గణాకాంల ప్రకారం అక్కడి పెళ్లైన మహిళల్లో జననాల రేటు 1.3ని మించలేదు. తాజాగా ముగ్గురి పిల్లలకి అనుమతి ఇవ్వడంపైనా చైనీయుల్లో పెద్దగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం లేదు.   
 

మరిన్ని వార్తలు