అంతరిక్షంపై డ్రాగన్‌ నజర్‌...!

3 May, 2021 21:22 IST|Sakshi

బీజింగ్‌: అంతరిక్షంలో పాగా వేయడం కోసం చైనా పావులు కదుపుతోంది. అందుకుగాను అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌  29 రోజున స్పేస్‌ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించడం కోసం ఒక మ్యాడుల్‌ను స్పేస్‌లోకి పంపింది. 2022లోపు స్పేస్‌ స్టేషన్‌ను పూర్తి చేయడానికి చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మ్యాడుల్‌కు ‘టియాన్హె’ గా నామకరణం చేశారు. దీనిలో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్‌ చేస్తోంది.  తియాన్ గాంగ్ స్పేస్‌ స్టేషన్‌లో భాగంగా తొలి మ్యాడుల్‌ ‘టియాన్హె’ను చైనా లాంగ్‌ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది.

చైనా మొట్టమొదటిసారిగా  తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్నస్పేస్‌ స్టేషన్‌లోని మూడు ప్రధాన భాగాలలో టియాన్హె ఒకటి.భూమి నుంచి సుమారు  340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. కాగా ఇప్పటి వరకు అంతరిక్షంలో నాసా అభివృద్ధి చేసిన ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ ఒకటే వ్యోమగాములకు నివాస కేంద్రంగా ఉంది. ఈ స్పేస్‌ స్టేషన్‌కు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూరప్, జపాన్ ,కెనడా దేశాల మద్దతుతో నిర్మించారు. కాగా  ఈ స్టేషన్‌లో చైనా పాల్గొనకుండా  యునైటెడ్ స్టేట్స్ నిరోధించింది.

టియాన్హే ప్రాజెక్ట్‌ అంతరిక్షంలో చైనాను శక్తివంతమైన దేశంగా నిర్మించడంలో ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  2030లోపు చైనా అంతరిక్షంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనే ప్రయత్నంలో ఇప్పట్నుంచే తన కార్యచరణను ముమ్మరం చేసింది.

చదవండి: జెఫ్‌ బెజోస్‌ సంచలన నిర్ణయం.. నాసాపై..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు