క్రేజీమెంటాలిటీ: కేఎఫ్‌సీ.. సీకేజీ 

13 Jun, 2021 10:03 IST|Sakshi

కేఎఫ్‌సీ చికెన్‌ను ఇష్టపడని మాంసాహారులు అరుదు. ఆ క్రేజీ చికెన్‌ను ఆరునెలల పాటు ఫ్రీగా తిన్నాడు. చైనాలోని 23 ఏళ్ల ఓ యువకుడు.  పబ్లిసిటీ కోసం చాలా కంపెనీలు ఫ్రీ కూపన్లను అందిస్తుంటాయి కదా!  అలాంటి ఫ్రీ కేఎఫ్‌సీ కూపన్లను వివిధ యాప్స్‌ ద్వారా  సంపాదించటం మొదలుపెట్టాడు ఆ యువకుడు.  వాటిని ఆన్‌లైన్‌లో అమ్ముతూ  సుమారు రూ. రెండు లక్షల వరకు ఆర్జించాడు కూడా. అక్కడితో ఆగలేదు.  

తన పేరుతో ఉన్న కూపన్లను ఎవరో వాడుకున్నారంటూ ఫిర్యాదు  చేసి మరికొన్ని కూపన్లనూ పొందాడు. ఇలా ఆరునెలల పాటు ఫ్రీగా చికెన్‌ తింటూ ఎంజాయ్‌ చేశాడు. హఠాత్తుగా పోలీసులు అతని నోటి కాడి చికెన్‌ను లాగేశారు. ఆ యువకుడి మోసాన్ని తెలుసుకొని. నిరూపించి రెండేళ్ల జైలు శిక్షనూ ఖరారు చేయించారు. సీకేజీ.. చిప్పకూడు గతి పట్టించారు. ప్చ్‌.. అత్యుత్సాహంతో ఆ యువకుడు తన ఫ్రీ చికెన్‌ సీక్రెట్‌ను ఫ్రెండ్స్‌తో పంచుకోకపోయుంటే బాగుండేది.

>
మరిన్ని వార్తలు