ఇదేం ఆచారం: అదృష్టం కోసం వ్యక్తి తింగరి పని

28 Apr, 2021 16:59 IST|Sakshi

అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ విమానం ఇంజీన్‌లోకి కాయిన్స్‌

బీజింగ్‌: మనిషి ఆశా జీవి. తన జీవితం గురించి రకరకాల కలలు కంటాడు. ఆర్థికంగా బాగా ఎదగాలని.. లగ్జరీగా జీవించాలని ఆశపడతాడు. తమ కలలు సాకారం చేసుకోవడం కోసం కొందరు బాగా కష్టపడితే.. మరి కొందరు మాత్రం ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలపై ఆధారపడతారు. వీరిలో కొందరు లాటరీ టికెట్లు కొని అదృష్ట దేవత కోసం ఎదురు చూస‍్తుంటారు. మరికొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి పిచ్చి పని చేసి ఎయిర్‌ పోర్ట్‌ అధికారుల్ని, పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. 

మనలో కొందరు ప్రయాణాలు చేసే సమయంలో రకరకాల ఆచారాలు, నమ్ముకాలు పాటిస్తుంటారు. వాటిలో బాగా ఫేమస్‌ కాయిన్‌ ట్రెడీషన్‌. అదేంటంటే  ప్రయాణిస్తుండగా.. ఏదైనా నది తారసపడితే అందులోకి నాణేలు విసురాతారు. బస్సు, రైళ్లలో ప్రయాణం చేసే వారికే కాక.. విమానంలో ప్రయాణం చేసే వారు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తారు. వీరు ఏం చేస్తారు అంటే తాము ప్రయాణించబోయే విమానం ఇంజిన్‌లోకి కాయిన్స్‌ విసురుతారు. అలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. తాజాగా ఓ యువకుడు అలాగే చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. 

నేషనల్‌ మీడియా కథనం ప్రకారం.. చైనాలోని వాంగ్‌ అనే యువకుడు వైఫాంగ్ నుండి హైకూకు వెళ్లాల్సి ఉంది. అందుకోసం వైఫాంగ్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బీబు గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జీఎక్స్ 8814 నెంబర్‌ గల ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అనుకున్న సమాయానికి విమానం ఎక్కాడు. 148 మంది ప్రయాణిస్తున్న విమానం రన్‌ వే మీద ఉండగా వాంగ్‌ తన దగ్గరున్న ఆరు కాయిన్స్‌ను ఎర్రటి పేపర్లో చుట‍్టి విమానం ఇంజిన్‌లోకి విసిరాడు. అవి కాస్త కిందపడిపోవడంతో ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు, పోలీసులు పరుగులు పెట్టారు. భద్రతా సమస్యల కారణంగా ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు ఫ్లైట్ రద్దు చేశారు.  

ఈ సంఘటన తరువాత యువకుడు వాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. అయితే ఇలా ఫ్లైయిట్‌ ఇంజిన్‌లోకి కాయిన్స్‌ విసరడం ఇది తొలిసారేం కాదు. గతేడాది 28 ఏళ్ల యువకుడు 'అదృష్టం' కోసం విమానం ఇంజిన్‌లోకి కాయిన్స్‌ విసిరాడు. దీంతో యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్‌ పోర్ట్‌​ అధికారులు 1,20,000 యువాన్ల (రూ. 12.36 లక్షలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. చేసేదేం లేక సదరు యువకుడు ఆ మొత్తాన్ని కట్టాడు.

చదవండి: కడుపులో 4.15 కిలోల బంగారం 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు