Viral: బ్యాంకులో మాస్క్‌ పెట్టుకోవాలి అన్నందుకు.. అధికారులకు దిమ్మతిరిగేలా షాకిచ్చాడు!

24 Oct, 2021 13:01 IST|Sakshi

బీజింగ్‌: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా. మహమ్మారి కట్టడి కోసం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి సర్వ సాధారణమయ్యాయి. మాస్క్‌ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్‌లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్‌ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ గార్డ్‌ ఆ బిలియనీర్‌ని అడ్డగించి మాస్క్‌ ధరించకపోతే బ్యాంకులోకి అనుమతిలేదని తేల్చి చెప్పాడు. దీంతో సదరు మిలియనీర్ చేసిన పనికి బ్యాంకు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చైనాలోని బ్యాంక్ ఆఫ్‌ షాంఘైలో చోటు చేసుకుంది.

సెక్యూరిటీ గార్డు చెప్పిన విధానం నచ్చలేదో, లేదా అతని ప్రవర్తన నచ్చలేదో గానీ ఆ వ్యక్తి తన ఖాతాలోని డబ్బులన్నీ విత్‌ డ్రా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం.. ఒక రోజుకు 5 మిలియన్ల యువాన్‌లు (భారత కరెన్సీ ప్రకారం 5.8 కోట్లు) మాత్రమే బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే పరిమితి ఉంది.

దీంతో అంత సొమ్మును ఒకేసారి విత్‌ డ్రా చేశాడు ఆ బిలియనర్‌. ఇదిలా ఉంటే ఒకే కరెన్సీ కౌంటర్‌తో అంత పెద్ద మొత్తాన్ని లెక్కపెట్టడానికి బ్యాంకు సిబ్బందికి రెండు గంటలపైగా పట్టిందట. అంతటి ఆగకుండా తన ఖాతాలో డబ్బు మొత్తం విత్‌ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇదే సీను రిపీట్‌ అవుతుందని ఆ మిలియనీర్‌ చెప్పాడట. అలా విత్‌ డ్రా చేసిన డబ్బును వేరే బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు తెలిపాడు.  ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బులు ఉన్న సూట్‌కేసులను తన లగ్జరీ కారులో తీసుకెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: Viral Video: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్‌ అయిన వధువు..ఇంతకీ అందులో ఏమందంటే..!

మరిన్ని వార్తలు