'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!

10 Aug, 2022 17:08 IST|Sakshi

బీజింగ్‌: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటన విషయమై చైనా అగ్గి మీద గుగ్గిలంలా మారిన సంగతి తెలిసిందే. దీంతో తైవాన్‌ చుట్టూత పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ గస్తీ కాసింది. తైవాన్‌ జలాల్లో చైనా దళాలు మోహరించడమే కాకుండా సైనిక విన్యాసలు చైసి తైవాన్‌ని భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ విన్యాసాలు కొద్ది రోజుల్లో ఆగిపోతాయని అంతా అనుకున్న సమయంలో తాజగా చైనా మరో బాంబు పేల్చింది.

లైవ్‌ ఆర్మీ ఫైర్‌ డ్రిల్‌ పేరిట భూ వాయు గగన మార్గాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించి ఇప్పుడేమో అన్ని పనులు పూర్తి చేశామని ఇక ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి రెడీ అని తెగేసి చెప్పేస్తోంది. దాదాపు వారం రోజుల సైనిక కసరత్తుల తదనంతరం తైవాన్‌ చుట్టుతా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేశామని తన అధికారిక సోషల్‌ మీడియా వీబో అకౌంట్‌లో పేర్కొంది.

ఈ మేరకు తమ దళాలు తైవాన్‌ జలసంధిలో ఎప్పటికప్పడూ పరిస్థితులను నిశితంగా గమనించడమే కాకుండా క్రమ తప్పకుండా పెట్రోలింగ్‌ని నిర్వహిస్తామని చెప్పింది. అలాగే ఏ సయమంలోనేనా పోరాడేందుకు సైనిక శిక్షణను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఒక పక్క యూఎస్‌ ఎంతలా హెచ్చరించినా.. తన దూకుడు తగ్గించుకోనని తెగేసి చెప్పడమే కాకుండా తైవాన్‌ చైనాలో భాగమని పదే పదే నొక్కి చెబుతుండటం గమనార్హం.

(చదవండి: అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు