చైనాలో మళ్లీ లాక్‌డౌన్!

8 Jan, 2021 20:15 IST|Sakshi

చైనా: కరోనా మహమ్మారి మరోసారి చైనా దేశాన్ని పట్టి పీడిస్తుంది. 2019లో వూహాన్‌ నగరంలో వైరస్ వ్యాపించిన తర్వాత పెద్ద ఎత్తున చైనా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వైరస్ వ్యాపించిన ప్రాంతాల్లో భారీగా టెస్టింగులతో పాటు లాక్‌డౌన్‌లు విధించడంతో వైరస్ ‌వ్యాప్తిని చాలా వరకు నియంత్రించారు. తాజాగా మళ్లీ చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. చైనా రాజధాని బీజింగ్‌కు దక్షిణంగా ఉన్న రెండు నగరాలలో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ నగర రహదారులను మూసివేయడంతో పాటు రవాణా సౌకర్యాలను నిలిపివేసింది.(చదవండి: మా వ్యాక్సిన్‌ చాలా డేంజర్‌: చైనా ఎక్స్‌పర్ట్‌)  

ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో గత వారంలో 127 కొత్త కోవిడ్-19కేసులు, అదనంగా 183 అసింప్టోమాటిక్ ఇన్‌ఫెక్షన్లు కనిపించాయి. 2019 తర్వాత చైనాలో ఇన్ని కేసులు ఒకేసారి వెలుగుచూడటం ఇదే తోలిసారి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు హెబై ప్రావిన్స్‌లోని షిజియాషాంగ్, జింగ్టాయ్ సిటీల్లో లాక్‌డౌన్ విధించారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని ఆదేశించారు. హెబీ ప్రావిన్స్‌లోని నివాసితులు బీజింగ్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల, ఆహార ప్యాకేజింగ్ ద్వారా చైనాలోకి ఈ ప్రవేశించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు