అరుదైన ఆపరేషన్‌ నిర్వహించిన చైనా

21 Nov, 2020 11:57 IST|Sakshi

ముగ్గురు శాస్త్రవేత్తలతో సముద్రంలో 10 వేల అడుగుల లోతుకు సబ్‌మెరైన్‌

బీజింగ్‌: చైనా అరుదైన ఘనత సృష్టించింది. ఓ సబ్‌మెరైన్‌ని సముద్రం అడుగున పార్క్‌ చేసింది. ఆ సమయంలో దాని మీద ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు. దాదాపు 10 వేల మీటర్లకు పైగా లోతున అనగా భూమి మీద గల అత్యంత లోతైన సముద్ర కందకం(ఒషియన్‌ ట్రెంచ్‌)లోకి మనుషులతో కూడిన సబ్‌మెరైన్‌ని పంపిన దృశ్యాలను లైవ్‌లో ప్రసారం చేసింది. చైనా ఈ విన్యాసాలను పసిఫిక్‌ సముద్రంలో నిర్వహించింది. ''ఫెండౌజ్ "అనే పిలవబడే సబ్‌మెరైన్‌ పసిఫిక్‌ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్‌లోకి ముగ్గురు శాస్త్రవేత్తలని తీసుకుని వెళ్లింది. చైనా అధికారిక చానెల్‌ సీసీటీవీలో ఇది లైవ్‌ స్ట్రీమ్‌ అయ్యింది. సబ్‌మెరైన్‌కి అమర్చిన డీప్‌ సీ కెమరా ఆకుపచ్చ-తెలపు వర్ణంలోని ఫెండౌజ్‌ నల్లని నీటిలో లోతుకు మునిగిపోతూ సముద్రపు అట్టడుగు భాగాన్ని తాకడాన్ని రికార్డు చేసి ప్రసారం చేసింది. ఫెండౌజ్‌ ఈ విన్యాసాలు చేయడం ఇదే రెండో సారి. ఈ నెల ప్రారంభంలో మొదటి సారిగా 10,909 మీటర్ల లోతుకు వెళ్లి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. (చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన)

                  (సబ్‌మెరైన్‌తో పాటు సముద్రం అట్టడుగు భాగానికి వెళ్లి వచ్చిన శాస్త్రవేత్తలు)

ఇక ప్రపంచవ్యాప్తంగా సముద్రంలో అత్యంత లోతుకు వెళ్లిన ఘనత అమెరికన్‌ సబ్‌మెరైన్‌ సాధించింది. ‘అమెరికన్‌ ఎక్స్‌ప్లొరర్’‌ అనే సబ్‌మెరైన్‌ 2019లో సముద్రంలో 10,927 మీటర్ల లోతుకు వెళ్లి రికార్డు సృష్టించింది. ఇక సముద్రం అడుగున గల జీవ నమూనాలను రికార్డు చేయడానికి ఫెండౌజ్‌కి రోబోటిక్‌ చేతులను అమర్చారు. ఇది తన చుట్టూ ఉన్న వస్తువులను గుర్తించడానికి సోనార్‌ కళ్లని అమర్చారు. ఇవి ధ్వని తరంగాల సాయంతో పని చేస్తాయి. ఇక ఫెండోజ్‌ శక్తి సామార్థ్యాలను పరీక్షించడం కోసం పలుమార్లు దాన్ని నీటిలో మునకలు వేయించారు. ఇక సబ్‌మెరైన్‌తో పాటు సముద్రంలెరి ప్రయాణించిన శాస్త్రవేత్తలు తన అనుభవాలను వెల్లడించారు. ‘సముద్ర అడుగు భాగం ఏలియన్స్‌ ప్రపంచంలా.. చాలా వింతగా ఉంది. అక్కడ మనకు తెలియని ఎన్నో జాతులు, జీవుల పంపిణీ ఉంది’ అని తెలిపారు. ఇక తమ పరిశోధనల కోసం కొన్ని నమునాలను తమతో పాటు తీసుకొచ్చామన్నారు. రెండు సార్లు ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాతే ఇది విజయవంతమయ్యిందని చెప్పగలం అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్త జూ మిన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు