China Covid Wave: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య..

25 Dec, 2022 12:46 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు లక్షల కొత్త కేసులు, వేల మరణాలు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పడకలు ఖాళీలేక బేంచీలు, బల్లల మీదే చికిత్స అందిస్తున్నారు. శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటికల్లో స్థలం లేక వేరే ప్రదేశాలకు తరలిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే చైనా ఆరోగ్య శాఖ ఆదివారం అనూహ్య ప్రకటన చేసింది. ఇకపై కరోనా కేసుల వివరాలు తాము వెల్లడించమని తెలిపింది. అంటువ్యాధుల నియంత్రణ, పరిశోధన కేంద్రమే కరోనా వివరాలను చూసుకుంటుందని చెప్పింది. అయితే కేసుల లెక్కలు ఎప్పుడు వెల్లడిస్తారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో కరోనా లెక్కలు దాచేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.

రేడియో ఫ్రీ ఆసియా లీక్ చేసిన ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకారం చైనాలో 20 రోజుల వ్యవధిలోనే 25 కోట్ల మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య చైనా జనాభాలో 17.65 శాతం కావడం గమనార్హం. అంతేకాదు రానున్న మూడు నెలల్లో చైనాలో కరోనా కారణంగా 20 లక్షల మంది చనిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి: వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..

మరిన్ని వార్తలు