ఫ్రెండ్లీగా రండి.. దాని కోసమైతే రాకండి: చైనా

23 Jun, 2021 18:38 IST|Sakshi

బీజింగ్‌: మైనార్టీ  దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు సహకరించాలని అంతార్జతీయ మానవ హక్కుల సంఘం (యూఎన్‌హెచ్‌ఆర్సీ) చేసిన వినతిని చైనా తిరస్కరించింది. ఈ అంశంపై యూఎన్‌హెచ్‌ఆర్సీకి చైనా ఘటాగా బదులిచ్చింది. కాగా జింగ్‌జియాంగ్‌లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించింది.

అదే క్రమంలో తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట అక్కడి ప్రజల భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకుంటోంది. ఈ చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై చైనా అధికారి మాట్లాడుతూ.. యూఎన్‌హెచ్‌ఆర్సీ హైకమిషనర్‌ జిన్‌జియాం‍గ్‌ సందర్శించడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ పర్యటన ద్వైపాక్షిక మార్పిడి, సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కూడిన.. స్నేహపూర్వక పర్యటనగా ఉండాలి తప్ప, దార్యాప్తు వంకతో తమ దేశానికి రావొద్దని స్పష్టం చేశారు.

ఈ సమస్య ద్వారా చైనాలో రాజకీయ సంక్షోభం సృష్టించి, మాపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇక జిన్‌జియాం‍గ్‌ జరుగుతున్న హింసాత్మక దాడులకు ఈస్ట్‌ తుర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ కారణమని తెలిపారు. కాగా ఉయ్‌గుర్ల మరణాలపై ఇరాస మానవ హక్కుల మండలిలో 42 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జిన్‌జియాం‍గ్‌ ముస్లిం ఉయ్గుర్‌లపై జరిగిన మారణహోమంపై దర్యాప్తు జరపాలని యూఎన్‌హెచ్‌ఆర్సీ పై  పలు దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు