Winter Olympic 2022: మా ఎంపిక సరైనదే అంటూ చైనా కొత్త పల్లవి

8 Feb, 2022 06:16 IST|Sakshi

టార్చ్‌బేరర్‌ ఎంపికను సమర్థించుకున్న చైనా  

Winter Olympic 2022: వింటర్‌ ఒలంపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌లోయ ఘర్షణతో సంబంధం ఉన్న సైనికుడిని ఎంపిక చేయడాన్ని చైనా సమర్థించుకుంది. సదరు సైనికుడిని ప్రమాణాలకు అనుగుణంగా  ఎంచుకున్నామని తెలిపింది. ఇందులో రాజకీయ దురుద్దేశాలు చూడవద్దని కోరింది. గల్వాన్‌     లోయ ఘర్షణలో గాయపడిన కమాండర్‌ క్వి ఫాబావోను చైనా టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి.

దీనికి నిరసనగా వింటర్‌ ఒలంపిక్స్‌ ఆరంభోత్సవాలను భారత్‌ బహిష్కరించింది. యూఎస్‌ సైతం చైనా చర్యను తప్పుబట్టింది. అయితే ఇది కేవలం ముందుగా అనుకున్న ప్రమాణాలకు లోబడి తీసుకున్న నిర్ణయమని చైనా    విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఝావో లిజియన్‌ చెప్పారు. ఈ విషయాన్ని భారత్‌ హేతుబద్ద దృష్టితో చూడాలని, అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దని కోరారు. అయితే ఒలంపిక్స్‌లాంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం    చేయాలని చూడడం చైనా కోరికని భారత ప్రతినిధి బాగ్చీ విమర్శించారు.

మరిన్ని వార్తలు