500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం

9 Jun, 2021 14:30 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో ఏనుగుల ఒక చోటనుంచి మరో చోటకు వలసపోతున్నాయి. యునాన్‌ ఫ్రావిన్స్‌ నైరుతి ప్రాంతంలో ఉ‍న్న కొండల మధ్యలోని వైల్డ్‌లైఫ్‌ రిజర్వ్‌ నుంచి 15 ఏనుగులు గుంపుగా బయల్దేరాయి. అక్కడి నుంచి అదే ఫ్రావిన్సులో దాదాపు 500 కిమీ దూరంలో ఉన్న కున్‌మింగ్‌ అటవీ ప్రాంతానికి వెళుతున్నాయి. సుమారు 500 కిమీ పైగా ప్రయాణిస్తున్న ఈ ఏనుగుల గుంపు మార్గమధ్యలో అలసిపోయాయి.. విశ్రాంతి కోసం అన్ని గుంపుగా ఒకేచోట సేద తీరాయి.


చైనా మీడియా ఈ ఏనుగుల గుంపును వీడియోలు తీస్తూ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేంతవరకు జనాలు ఎక్కువగా బయట తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో 200 కిమీ దూరం వెళితే ఆ ఏనుగుల గుంపు తమ గమ్య స్థానానికి చేరుకుంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
చదవండి: 4 భారీ టవర్లు... 10 సెకన్లలోనే నేలమట్టం!

బాప్‌రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు!

మరిన్ని వార్తలు