మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం: చైనా

30 Aug, 2020 11:26 IST|Sakshi
చైనా, నార్వే దేశాల ఫారిన్‌ మినిస్టర్‌లు

చైనా కాన్ఫిడెన్స్‌ చూస్తే శత్రువుకి కూడా ముచ్చటేస్తుంది. ట్రంప్‌ ఎన్నికల  మూడ్‌లో లేకుంటే ఆయనా ముచ్చట పడేవారు. చైనా శుక్రవారం నాడు ఇంటి మీదకు వెళ్లి మరీ నార్వేని హెచ్చరించింది! మావాళ్లకు కనుక నోబెల్‌ శాంతిబహుమతి ఇచ్చి మాలో మాకు పెట్టారో మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం అని చైనా ఫారిన్‌ మినిస్టర్‌ వాంగ్‌ ఇ నార్వేను గట్టిగా బెదిరించారు. ‘మాలో మాకు’ అంటే.. చైనాకు, హాంకాంగ్‌కి. హాంకాంగ్‌ ఒక ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది కానీ అది చైనా పాలనాధికారాల కింద ఉన్న ప్రత్యేక ప్రాంతం మాత్రమే. ఈమధ్య చైనా ఒక కొత్త భద్రత చట్టం తెచ్చింది. దానిని హాంకాంగ్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు జరుపుతూనే ఉన్నారు. ఆ నిరసనకారులకు నార్వే నోబెల్‌ కమిటీ ‘అండ్‌.. ఈ ఏడాది శాంతి బహుమతి గోస్‌ టు..’ అంటూ అవార్డును ప్రకటించే ప్రమాదం ఉందని చైనా స్మెల్‌ చేసినట్లుంది. (66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?)

అందుకే ఈ ముందు జాగ్రత్త బెదిరింపులు. ఈ మధ్య బ్రిటన్‌కి కూడా చైనా ఇలాగే వార్నింగ్‌ ఇచ్చింది. ‘మీ మంచితనం చేత మా మంచివాళ్లని మీ మంచి దేశంలో ఉండటానికి రప్పించుకుంటే మామూలుగా ఉండదు చూడండీ..’ అని టెస్ట్‌ ఫైర్‌ లేవో చేసింది. ఇప్పుడు నార్వేకు తాజాగా ‘శాంతి సందేశం’ ఇచ్చింది. అయినా నోబెల్‌ ఇచ్చేది స్వీడన్‌ కదా. మధ్యలోకి నార్వే ఎందుకొచ్చింది? పెద్దాయన ఆల్ఫెడ్ర్‌ నోబెల్‌ అలా వీలునామా రాసి వెళ్లారు. నోబెల్‌ శాంతి బహుమతిని మాత్రం నార్వేనే ఇవ్వాలని. కరోనాకు కారణం అయి, ఏమాత్రం గిల్టీ ఫీలింగ్‌ లేకుండా చైనానే తిరిగి అందరి పైనా కయ్యి కయ్యి మంటోందంటే.. ఆ కాన్ఫిడెన్స్‌ను చూసి నెక్స్‌ట్‌ ముచ్చట పడవలసిన వాళ్లం మనమే. ప్రస్తుతం చైనా చైనా లో లేదు. ఇండియా బోర్డర్‌ లో ఉంది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు