నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన చైనా

18 Sep, 2020 12:27 IST|Sakshi

బీజింగ్‌: త్వరలో కోవిడ్‌-19 ఆంక్షలను సడలించనున్నట్లు చైనా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీనిలో భాగంగా సినిమా థియేటర్లలో 75 శాతం టిక్కెట్లను విక్రయించడానికి అనుమతించింది. ప్రస్తుతం చైనాలో 50 శాతం టిక్కెట్ల అమ్మకానికి అనుమతి ఉంది. ఈ క్రమంలో కొత్త మార్గదర్శకాలను చైనా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్‌ ప్రొజెక్షన్ అసోసియేషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు సెప్టెంబర్‌ 25 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చర్యల వల్ల సినీ పరిశ్రమలోని వారికి ఎంతో మేలు జరగనుంది. గత ఆరు నెలలుగా థియేటర్ల షట్‌డౌన్ కావడం‌తో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే చైనాలో అనేక బ్లాక్‌ బాస్టర్‌ మూవీలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాక సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. సెప్టెంబర్ 25 న చైనాలో మొత్తం 9 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. (చదవండి: ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం)

మరిన్ని వార్తలు