మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా...సవరింపు చట్టం

27 Oct, 2022 18:58 IST|Sakshi

హాంకాంగ్‌: లింగ వివక్ష, లైంగిక వేధింపుల నుంచి చైనాలో మహిళలకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంతో చట్టాన్ని సవరించింది. విస్తృతమైన ప్రజాభిప్రేయ సేకరణ, పలు సవరణలు తదనంతరం ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పించింది. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వం వారికి తగిన గౌరవం దక్కేలా చేయడం, అబార్షన్‌ పట్ల వస్తున్న నిర్భంధ వైఖరి తదితరాలపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత చైనా మహిళల రక్షణ  చట్టాన్ని సవరించడం ఇదే తొలిసారి.

ఈ మేరకు మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ చట్టం ముసాయిదాను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) స్టాండింగ్‌ కమిటీకి  సమర్పించింది. ఐతే ఈ ముసాయిదాను ఇంకా అమలు చేయలేదు. సుమారు 10 వేల మంది ప్రజల సలహాలు, సూచనల కోసం పంపినట్లు ఎన్‌పీసీ తెలిపింది. ఈ ముసాయిదా చట్టం వెనుకబడిన, పేద, వృద్ధ, వికలాంగ మహిళల హక్కుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తోందని స్థానిక జిన్హుహ వార్త సంస్థ పేర్కొంది.

ఈ చట్టం ప్రకారం....మహిళల శ్రమ, సామాజిక భద్రత హక్కుల ప్రయోజనాలను ఉల్లంఘిస్తే సదరు యజమానులను శిక్షిస్తుంది. మహిళల అక్రమ రవాణ, కిడ్నాప్‌, రక్షణను అడ్డుకోవడం తదితరాలను నేరాలుగా పరిగణిస్తుంది. అలాగే అక్రమ రవాణాకు గురైన లేదా కిడ్నాప్‌కి గురైన మహిళలను రక్షించే బాధ్యత అధికారులపై  ఉంటుందని స్పష్టం చేసింది. 

(చదవండి: మిస్‌ యూనివర్స్‌ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ)

మరిన్ని వార్తలు