చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..

4 Dec, 2022 17:07 IST|Sakshi

కరోనా పుట్టినిల్లు అయినా చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏళ్ల తరబడి క్వారంటైన్‌, లాక్‌డౌన్‌లతో మగ్గిపోయిన ప్రజలు ఆగ్రహంతో తిరబడే స్థాయికి వచ్చినా.. చైనా  ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మంకుపట్టు పడుతూనే ఉంది. ఇప్పుడుప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఆ మహమ్మారి నుంచి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ హాయిగా ఉంటున్నా...ఇంకా చైనా మాత్రం జీరో కోవిడ్‌ అంటూ కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది. ప్రజల్లో ఓపిక చచ్చి వీధల్లోకి వచ్చి నిరసనలు చేసినా... సైన్యంతో కట్టడి చేసింది.

వారిని ఒక  జంతువుల్లా బలవంతంగా నిర్బంధంలో ఉంచేందుకే యత్నించింది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని జిన్‌పింగ్‌ రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగానే గాక సోషల్‌ మీడియాల్లో సైతం నిరసన సెగలు ఊపందుకోవడంతో వెనక్కి తగ్గేంది. ఆఖరికి ప్రపంచ దేశాలు సైతం ఇంతలా కఠినా ఆంక్షలు విధించొద్దు అని సూచించినా.. తగ్గని చైనా లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించే ప్రయత్నం చేసింది. చైనా ప్రభుత్వం అనుహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న తరుణంలోనే కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభించింది.

ప్రజలు ప్రయాణించేలా ఆంక్షలు సడలించిన తర్వాత కేసులు పెరగడంతో చైనా గుట్టుచప్పుడూ కాకుండా తన పాలసీని తనదైన శైలిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఏ వ్యక్తి అయినా కరోనా బారిన పడినట్లు తెలిస్తే చాలు అతని ఇంటి వద్దకు వచ్చేయడం క్యారంటైన్‌కి తీసుకుపోవడం వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని బలవంతంగా క్వారంటైన్‌కి తీసుకువెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో హోం క్వారంటైన్‌లో ఉంటానన్న వినకుండా అదికారులు అతన్ని ఎలా బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మూడేళ్లు అయినా కరోన మహమ్మారీ కంటే అక్కడి ఆంక్షలతోనే చైనా ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు.

(చదవండి: ఉక్రెయిన్‌ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్‌)

మరిన్ని వార్తలు