China Flight Crash: ఘోర విమాన ప్రమాదం.. చైనీస్‌ విమానశాఖ సంచలన నిర్ణయం

22 Mar, 2022 13:29 IST|Sakshi

చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్‌ ప్రాంతంలో  సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా మంగళవారం షెడ్యూల్ చేయబడిన 11,800 విమానాలలో 74% రద్దు చేస్తున్నట్లు చైనీస్‌ విమాన శాఖ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం బీజింగ్, షాంఘై మధ్య ప్రయాణించాల్సి ఉంది. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత రద్దీ దేశీయ మార్గాలలో ఇదీ ఒకటి. గతంలో కోవిడ్ పరిమితుల కారణంగా చైనీస్ విమానాలు చాలా కాలాం గాల్లో ఎగరలేదు.

దీంతో చైనీస్‌ విమానశాఖ చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. అయితే తాజాగా మంగళవారం చేసిన రద్దుతో ఆ నష్టం మరింత పెరగనున్నట్లు చైనీస్ ఏవియేషన్ డేటా కంపెనీ డేటా పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్‌ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరరిన విమానం వుఝు సమీపంలోని టెంగ్జియాన్‌ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అందులో 132 మంది ప్రయాణికులు ఉన్నారు.  2010 తర్వాత చైనాలో జరిగిన తొలి విమాన ప్రమాదం ఇదే. 

చదవండి: China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి!

మరిన్ని వార్తలు