‘ఎవ‌డ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’..

23 Sep, 2023 09:27 IST|Sakshi

పిల్లలు చాలా పనుల్లో పెద్దలను అనుకరిస్తారు. చైనాలో ఒక పిల్లవాడు  నిపుణుడైన చెఫ్‌ను అనుకరిస్తూ జనం హృదయాలను దోచుకుంటున్నాడు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం X లో కొద్ది నెలల క్రితం పోస్ట్ అయిన వీడియో ఇంకా అందరినీ అలరిస్తూనే, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నేజియాంగ్‌లో నివసిస్తున్న అతని తల్లి, తమ పిల్లవాడు నెలల వయస్సులో వంట చేయడంపై ఆసక్తిని కలిగి ఉన్నాడని గ్రహించింది. 

పిల్లాడు టెలివిజన్‌లో వంటల కార్యక్రమాలలో చెఫ్‌లను చూస్తూ, వారిని అనుకరించడాన్ని ఆమె గమనించింది. వీడియోలో ఆ పిల్లాడు గరిటెతో పాన్‌ను బ్యాలెన్స్ చేస్తూ, అద్భుతమైన ప్రతిభను చూపించాడు. ఈ వీడియోను ఒలివియా వాంగ్ అనే యూజర్‌ షేర్‌ చేశారు. ‘ఈ పిల్లాడు వంట పాన్‌ను అంత వేగంగా ఎలా తిప్పుతున్నాడు? పిల్లాడి వంట ప్రతిభ అద్భుతంగా ఉంది’ అంటూ ఫొటో కామెంట్‌ రాశారు. ఈ వీడియోను చూసిన ఒక  యూజర్‌ ‘మూడేళ్ళ పిల్లాడికి నా కంటే బాగా వంట చేయడం వచ్చని తెలిసి, తట్టుకోలేకపోతున్నాను’ అని రాశారు.  

కాగా ఏడాది క్రితం ఇటువంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఒక పిల్లాడు అద్భుతంగా వంట చేస్తున్నాడు. @sonikabhasin పేరుతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. వీడియో ప్రారంభంలో ఆ పిల్లాడు  స్టూల్‌పై నిలబడటాన్ని గమనించవచ్చు. అప్పుడు ఆ పిల్లాడిని ఏం చేస్తున్నావని అతని తల్లి అడిగినప్పుడు ‘ఫ్రైడ్ రైస్’ అని ముద్దుముద్దుగా సమాధానం ఇచ్చాడు. ఈ వంటకంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, బీన్స్, క్యాప్సికమ్ జోడించానని కూడా చెప్పాడు.
ఇది కూడా చదవండి: ఖలిస్తాన్‌ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు?
 

మరిన్ని వార్తలు