చైనా కొత్త పొలిట్‌బ్యూరోలో మహిళలే లేరు

23 Oct, 2022 13:25 IST|Sakshi

బీజింగ్‌: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పగ్గాలు చేపట‍్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల చేసిన కొత్త పొలిట్‌ బ్యూరోలో ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేదు. 25 ఏళ్లలో చైనా కమ్యునిస్ట్‌ పార్టీలో ఇలా జరగడం తొలిసారి. మునుపటి పొలిట్‌బ్యూరోలో కూర్చున్న ఏకైక మహిళ సన్‌ చున్లాన్‌ పదవీ విరమణ చేశారు. తదనంతరం ఇంతవరకు ఏ ఇతర మహిళలను నియమించ లేదు. జిన్‌పింగ్‌ ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీని నలుగురు మిత్ర దేశాలతో ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో ఇద్దరు మాజీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న లీ కియాంగ్‌ కొత్త ప్రీమియర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు సింగపూర్‌  నేషనల్‌ యూనవర్సిటీలో చైనీస్‌ రాజకీయ నిపుణుడు ఆల్పెడ్‌ ములువాన్‌ మాట్లాడుతూ...చైనా ప్రజలే ఆయనను మూడోవసారి పాలించాలని కోరుకున్నారని  చెప్పారు. అంతేగాదు కాంగ్రెస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ దశాబ్దానికి రెండు సార్లు పగ్గాలు చేపట్టిన పాలనను ముగించిన కొద్దిసేపటికే నాయకత్వ పునర్‌వ్యవస్థీకరణ జరగడం విశేషం. 

(చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు