మా వ్యాక్సిన్‌ చాలా డేంజర్‌: చైనా ఎక్స్‌పర్ట్‌

8 Jan, 2021 14:39 IST|Sakshi

సినోఫామ్‌ వ్యాక్సిన్‌ గురించి సంచలన ఆరోపణలు

గంటల వ్యవధిలో కామెంట్స్‌ డిలీట్‌.. క్షమాపణలు చెప్పిన ఎక్స్‌పర్ట్

అతడి వ్యాఖ్యలని వక్రీకరించారు: గ్లోబల్‌ టైమ్స్‌

బీజింగ్‌: ఇన్ని రోజులు ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురు చూశాయి. అయితే టీకా అందుబాటులోని వచ్చిన ప్రస్తుత తరుణంలో వ్యాక్సిన్‌కు సంబంధించి అనేక అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఇద్దరు నర్స్‌లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా అభివృద్ధి చేస్తోన్న సినోఫామ్‌ వ్యాక్సిన్‌ గురించి సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైనాకు చెందిన వ్యాక్సిన్‌ ఎక్స్‌పర్ట్‌ సినోఫామ్‌ గురించి ఈ వ్యతిరేక ఆరోపణలు చేశారు. ఆ తర్వత గంటల వ్యవధిలోనే వాటిని డిలీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. (చదవండి: భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!)

డాక్టర్‌ తావో లినా అనే వ్యాక్సిన్‌ ఎక్స్‌పర్ట్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ వీబోలో ‘చైనా అభివృద్ధి చేసిన కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ సినోఫామ్‌ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. దీని వల్ల 73 సైడ్‌ ఎఫెక్ట్‌లు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి, బీపీ పెరగడం, చూపు కోల్పోవడం, తల నొప్పి, మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతున్నాయి’ అని తెలిపారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన ఈ కామెంట్స్‌ని డిలీట్‌ చేయడమే కాక క్షమాపణలు చెప్పారు. విచక్షణారహిత వ్యాఖ్యలు చేసి.. నా సహోదరులను అవమానించాను అన్నారు. ఇక తావోని బెదిరించి ఇలా క్షమాపణలు చెప్పించారని ప్రపంచ మీడియా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో బీజింగ్‌ అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ తావో లినా వ్యాఖ్యలని వీఓఏ వక్రీకరించిందని.. చైనా వ్యాక్సిన్‌ సురక్షితం అని తెలియజేసింది.

తావో లినా సినోఫార్మ్ వ్యాక్సిన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలను పోస్ట్ చేసినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాని వీఓఏ ఈ వ్యాఖ్యలని వక్రీకరించి.. తమ వ్యాక్సిన్‌ గురించి తప్పుడు ప్రచారం చేసిందని మండిపడింది. ఇక తావో తన వీబో అకౌంట్‌లో చేసిన వ్యాఖ్యలని డిలీట్‌ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ దుమారం సద్దుమణగకముందే చైనా మీడియాలో తావో లినా ‘చైనాలో అభివృద్ధి దశలో ఉన్న ఈ వ్యాక్సిన్‌లు క్షేమం, సురక్షితం కాదని నేను ఎప్పుడు చెప్పలేదు. మరో విషయం ఏంటంటే చైనా వ్యాక్సిన్‌ల సామర్థ్యం గురించి ఇప్పటికే నేను పలు ఆర్టికల్స్‌ ప్రచురించాను. వ్యాక్సిన్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాను’ అన్నారు. ఇక గురువారం వీబోలో చేసిన మరో పోస్ట్‌లో తావో లినా సినోఫామ్‌ వ్యాక్సిన్‌ గురించి ఆయన చేసిన ఆరోపణలని స్వయంగా స్వయంగా తనే తిరస్కరించారు. ఇక సినోఫామ్‌ వ్యాక్సిన్‌ 79 శాతం సామర్థ్యం కలిగి ఉందని.. చైనా దానికి అనుమతి ఇచ్చింది.(చదవండి: వ్యాక్సిన్‌ పంపుతున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి!)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు