కొత్తగా ఎర్నీ బాట్‌!

17 Mar, 2023 05:29 IST|Sakshi

హాంకాంగ్‌: మైక్రోసాఫ్ట్‌ సంస్థ తీసుకొచ్చిన కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌ ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి పోటీగా చైనా సెర్చ్‌ ఇంజిన్‌ బైదూ కొత్తగా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ ‘ఎర్నీబాట్‌’ను గురువారం ఆవిష్కరించింది.

అయితే, ఇది యూజర్లను నిరాశపర్చింది. ఎర్నీబాట్‌ సంపూర్ణమేమీ కాదని, ఇంకా మెరుగుపరుస్తామని బైదూ సీఈఓ రాబిన్‌ లీ చెప్పారు. ఎర్నీబాట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బైదూ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది. ఎర్నీబాట్‌ను ఉపయోగించుకొనేందుకు ఇప్పటిదాకా 650 కంపెనీలు ముందుకొచ్చాయని రాబిన్‌ లీ తెలిపారు. ఈ చాట్‌బాట్‌ మొదటి వెర్షన్‌ను 2019లో అభివృద్ధి చేశామన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు