Russia Ukraine War: తెలివిగా యూ టర్న్‌ తీసుకున్న చైనా!... రష్యాకి షాక్‌

4 Nov, 2022 21:37 IST|Sakshi

తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రష్యాని యుద్ధం మరింత తీవ్రతరం చేయవద్దని అణ్వాయుధాలు ఉపయోగించందంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌తో బీజింగ్‌ సందర్శించి రష్యా అణ్వయుధ దాడిని వ్యతిరేకించాలని కోరిన నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో 20వ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా జాతీయ కాంగ్రెస్‌ ముగిసిన తర్వాత చైనా అధ్యక్షుడుని కలిసిన తొలి యూరోపియన్‌ నాయకుడు స్కోల్జ్‌.

ఆయన బీజింగ్ గ్రేట్‌ హాల్‌ ఆప్‌ పీపుల్‌లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా అణు బెదిరింపును నిరోధించడం, వ్యతిరేకించడం వంటివి చేయాలని జిన్‌పింగ్‌కి చెప్పారు స్కోల్జ్‌. ఐతే చైనా ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగడానికి ముందు నుంచి రష్యాతో తమకు హద్దులు లేని స్నేహం ఉందని ప్రకటించడంతో యూరోపియన్‌తో సహా పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధం మొదలయ్యాక కూడా రష్యాకి మద్దతిస్తూ.. ప్రేరేపించింది యూఎస్‌ నేతృత్వంలోని నాటో అంటూ నిందించింది చైనా.

ఐతే ఇప్పుడూ చైనా తన యూరోపియన్లతో ఉన్న సంబంధాలను తిరిగే పెంపొందించే క్రమంలో అనుహ్యంగా రష్యాకి వ్యతిరేకంగా యూటర్న్‌ తీసుకుంది. అంతేగాదు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం కారణంగా యూరోపియన్‌, పాశ్చాత్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా జర్మనీలు మార్పు, అస్తిరత దృష్ట్యా సహకరించుకోవాల్సిన అవసరాన్ని గురించి జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు.

అంతేగాక చైనా, జర్మనీలు ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రధాన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం అని జిన్‌పింగ్‌ అన్నారు. అంతేగాదు జీ7 దేశాలనికి చెందిన నాయకుడు స్కోల్జ్‌ చైనా కంపెనీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు తేలడంతో, భద్రత దృష్ట్యా ఆయనకు స్వదేశంలో గణనీయమైన వ్యతిరేకత వెల్లువెత్తింది.

స్కోల్జ్ బీజింగ్‌తో ఒక ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఈ మేరకు స్కోల్జ్‌ చైనాలోని ప్రవాసులు జర్మనీ బయోఎన్‌టెక్‌కి సంబంధించిన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఉపయోగించడానికి అనుమతించడమే కాకుండా  చైనా పౌరులకు ఉచితంగా అందుబాటులో ఉంచేలా బీజింగ్‌ను ఒత్తిడి చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం.

(చదవండి: చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్‌!)

మరిన్ని వార్తలు