పాకిస్తాన్‌లో చైనీయులే టార్గెట్‌గా కాల్పులు.. డ్రాగన్‌ కంట్రీ సీరియస్‌ వార్నింగ్‌ తప్పదా?

28 Sep, 2022 20:04 IST|Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఆసుప్రతిలోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో ఒక చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. కరాచీ నగరంలోని డెంటల్‌ క్లినిక్‌లోని ఆంగతకుడు రోగిలా నటిస్తూ ప్రవేశించాడు. అనంతరం, గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు(ఓ మహిళ) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రోనిల్‌డి రైమండ్ చావ్, మార్గ్రేడ్ మరియు రిచర్డ్‌లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై సింధ్‌ ముఖ్యమంత్రి మురాద్‌ అలీ షా స్పందించారు. కాల్పుల ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనీయులపై దాడులు ఎక్కువయయ్యాయి. కాగా, ఏప్రిల్‌లో కరాచీ యూనివర్సిటీలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దళ సభ్యురాలు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఇక, ఈ దాడి తామే చేశామంటూ..  బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. దీంతో, పాక్తిసాన్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది.      

మరిన్ని వార్తలు