తరోన్‌ను భారత ఆర్మీకి అప్పగించిన చైనా ఆర్మీ

28 Jan, 2022 09:03 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: ఇటీవల అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్‌ యువకుడు మిరమ్‌ తరోన్‌ను భారతీయ సైనికులకు చైనా ఆర్మీ (పీఎల్‌ఏ) అప్పగించిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజుజు గురువారం ప్రకటించారు. అరుణాచల్‌లోని వాచా– దమాయ్‌ సరిహద్దు ప్రాంతం వద్ద తరోన్‌ను అప్పగించారన్నారు. ఈనెల 18న తరోన్‌ చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికి అప్పగించాలని పీఎల్‌ఏను భారత ఆర్మీ కోరింది. తరోన్‌ జాడ కోసం ఆర్మీ చేసిన కృషిని కిరణ్‌ కొనియాడారు. ఈ మేరకు తరోన్, సైనికులున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు. తరోన్‌ ఆచూకీ తెలిసినట్లు ఈ నెల 20న చైనా ఆర్మీ వెల్లడించింది. 

చదవండి: (పాక్‌లో జిహాద్‌ పేరుతో నిధులు సేకరించొద్దు)

మరిన్ని వార్తలు