Viral Video: భూ వాతావరణంలోకి చైనా రాకెట్‌ శకలాలు.. వీడియో వైరల్‌

31 Jul, 2022 11:14 IST|Sakshi

వాషింగ్టన్‌: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష‍్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్‌ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భావించి వీడియోలు తీశారు. శనివారం రాత్రి హిందూ మహాసముద్రంపై 10.45 గంటల సమయంలో భూవాతావరణంలోకి రాకెట్‌ శకలాలు ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష కమాండ్‌ సైతం నిర్ధరించింది. 

తూర్పు, దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ శకలాలు మండుతూ భూకక్ష‍్యలోకి రావటాన్ని వీక్షించారు. మలేసియా మీదుగా ఇవి ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అయితే.. అందులో ఎన్ని భూమిని తాకి ఉంటాయనేదానిపై సమాచారం లేదు. మరోవైపు.. చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరును నాసా ప్రతినిధి బిల్‌ నిల్సన్‌ తప్పుపట్టారు. తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగజేసే ప్రమాంద ఉందన్నారు. జులై 24న చైనా ఈ రాకెట్‌ను ప్రయోగించింది.

ఇదీ చదవండి: ల్యాబ్‌ మాడ్యూల్‌లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు

మరిన్ని వార్తలు