దూసుకొస్తున్న భారీ శకలం‌‌.. భూమిపై ఎక్కడ పడనుందో తెలుసా...!

7 May, 2021 20:10 IST|Sakshi
లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటు

అంతరిక్షంలో పాగా వేసేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం  తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు. అంతరిక్షం నుంచి రాకెట్లు శకలాలు తరుచూ భూమిపైకి దూసుకొస్తుంటాయి. అవి భూవాతావరణంలోకి వస్తుండగా కొన్నిశకలాలు పూర్తిగా గాలిలోనే మండిపోతాయి. భారీ సైజులో ఉండే రాకెటు శకలాలు కొన్ని భూమిపై పడి కొంత నష్టాన్ని మిగుల్చుతాయి.

చైనా ప్రయోగించిన టియాన్హే మ్యాడుల్‌ రాకెట్‌ శకలం సుమారు 20000 కేజీల బరువును, 30 మీటర్ల పొడవును కలిగి ఉంది. కాగా ఈ రాకెట్‌ భూమిపై పడితే చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టాన్నికలిగిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రాకెట్‌ శకలాలు భారత కాలమాన ప్రకారం మే 8న రాత్రి 7.30 నుంచి మే 10 తారీఖున అర్ధరాత్రి 1.00 గంటల మధ్య పడే అవకాశముందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం రాకెట్‌ ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, చైనా గుండా 41.5 డిగ్రీల అక్షాంశాలకు ఉత్తరంగా, 41.5 డిగ్రీల అక్షాంశాలకు దక్షిణంగా ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్‌ అంతర్జాతీయ జలాల్లో పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.

చదవండి: అంతరిక్షంపై డ్రాగన్‌ నజర్‌...!

మరిన్ని వార్తలు