China Power Crisis: చైనాలో చీకట్లు !

30 Sep, 2021 04:49 IST|Sakshi

విద్యుత్‌ కోతలతో ప్రజలు సతమతం

పెరిగిపోతున్న కాలుష్యం

షెన్‌యాంగ్‌: చైనాలో స్మార్ట్‌ ఫోన్‌ వెలుగులో ప్రజలు బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తున్నారు.  చాలా నగరాల్లో విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్‌ కోతలు అమలు చేశారని కొందరు ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తూ ఉంటే , ఇటీవల కాలంలో బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో డిమాండ్‌కి తగ్గ సప్లయ్‌ చేయలేమని విద్యుత్‌ కంపెనీలు చేతులెత్తేసినట్టు వార్తలు వస్తున్నాయి. చైనాలో కొన్ని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.

ఇటీవల చైనా విద్యుత్‌ వినియోగం రెట్టింపు అయింది. దీంతో కర్బన ఉద్గారాలు అధిక స్థాయిలో వెలువడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అక్టోబర్‌ 12–13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయి.

దీంతో అధ్యక్షుడు జిన్‌ పింగ్‌పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఆ లక్ష్యాలను చేరుకోవడానికే భారీగా విద్యుత్‌ కోతలు విధించారని తెలుస్తోంది. చైనాలో దాదాపుగా 20 ప్రాంతాల్లో అత్యధికంగా ఇంధనాన్ని వినియోగిస్తూ, ఉత్పత్తులు భారీగా చేపట్టడంతో కాలుష్యం పెరిగిపోయింది.  చైనాలోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్‌ వెలుగులో భోజనం చేస్తున్న కుటుంబ సభ్యులు

మరిన్ని వార్తలు