అస‌భ్య సందేశాలు.. బాస్‌ను చిత‌క‌బాదిన మ‌హిళ‌

7 May, 2021 20:37 IST|Sakshi

బీజింగ్‌: ఆడ‌వాళ్లు ఇంటి ప‌ట్టునే ఉండాలి.. కుటుంబ స‌భ్యుల‌ను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సిన‌వ‌న్ని అమ‌ర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయ‌డం అంటే పెద్ద నేరం చేసిన‌ట్లే. స్త్రీ అంటే నేటికి స‌మాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధ‌నాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌లు కోకొల్ల‌లు. ప‌నిలో ఏ మాత్రం జాప్యం జ‌రిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొంద‌రు పురుష ఉద్యోగులు ఇంటి ప‌ట్టున ఉండ‌క‌.. వీరికి ఇవ‌న్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. 

ఇక బాస్ "మ‌గానుభావుడైతే" ఆ క‌ష్టాలు ఇంకో ర‌కం. ఆ పెత్త‌నంతో ఆడ‌వారిని వేధింపులకు గురి చేస్తారు. త‌మ మాట విన‌క‌పోతే.. టార్చ‌ర్ పెడ‌తారు. బాస్ అనే కార‌ణం చెప్పి ఫోన్ చేసి.. అస‌భ్య సందేశాలు చేస్తూ మ‌హిళా ఉద్యోగుల‌ను వేధింపుల‌కు గురి చేస్తారు. చాలా మంది ఆడ‌వారు వీట‌న్నింటిని మౌనంగా భ‌రిస్తారు. కానీ కొంద‌రు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. 

ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన ఓ యువ‌తిని ఆమె బాస్ వేధింపుల‌కు గురి చేస్తాడు. ఉన్నాతాధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేదు. స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు ఉద్యోగిణి మాబ్ క‌ర్ర తీసుకువ‌చ్చి.. బాస్‌ను చిత‌క‌బాదింది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల‌వుతోంది. చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ‌ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మ‌హిళ త‌న బాస్ త‌న‌ను ఎలా హింసించాడో వివ‌రిస్తూ అత‌డిపై మాబ్ క‌ర్ర‌తో దాడి చేస్తుంది. 

త‌న‌కు అస‌భ్య సందేశాలు పంపాడ‌ని.. వార్నింగ్ ఇచ్చినా ఆగ‌లేద‌ని.. దాంతో ఉన్న‌తాధికారుల‌కు కూడా ఫిర్యాదు చేశాన‌ని అన‌డం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. ఓపిక న‌శించిన స‌ద‌రు యువ‌తి మాబ్ క‌ర్ర‌తో బాస్‌పై దాడి చేస్తుంది. చిత‌క‌బాదుతుంది. ఇక స‌ద‌రు బాస్ త‌న మొహం క‌నిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని త‌న‌ను వ‌దిలి వేయాల్సిందిగా బ‌తిమిలాడ‌తాడు. తాను జోక్ చేద్దామ‌ని భావించి మెసేజ్ చేశాన‌ని తెలుపుతాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌నులు స‌ద‌రు ఉద్యోగిణిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌తి మ‌హిళ ఇంతే  ధైర్యంగాఉండాల‌ని కామెంట్ చేస్తున్నారు.  

చ‌ద‌వండి: హనీమూన్‌ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు