25 ఏళ్ల తర్వాత ఆమెకి ‘తాను’ మగాడినని తెలిసింది

17 Mar, 2021 10:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బయెలాజికల్‌ ఉ‘మన్‌’

బీజింగ్‌: టెక్నాలజీ పరంగానేగాక, సైన్స్‌ పరంగానూ విచిత్రాలెన్నింటినో చైనాలో తరచూ చూస్తుంటాం. తాజాగా చైనాకు చెందిన  ఓ అమ్మాయి... తను అమ్మాయి కాదు అబ్బాయినన్న విషయాన్ని పాతికేళ్ల తరువాత తెలుసుకుని నోరెళ్ల బెట్టింది. పింగ్‌పింగ్‌(పేరుమార్చారు) అనే 25 ఏళ్ల వివాహిత సంతానం కోసం ఒక సంవత్సరం కాలంగా ఎదురుచూస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలు పుట్టకపోవడంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. పింగ్‌ను పరీక్షించిన డాక్టర్లు పింగ్‌ బయోలాజికల్‌ మ్యాన్‌గా పుట్టిందని నిర్ధారించారు. స్త్రీ జననేంద్రియ అవయవాలు ఉన్నప్పటికీ ఆమెలో ‘వై’ క్రోమోజోమ్‌ ఉండడం వల్ల ఆమె బయోలాజికల్‌ మ్యాన్‌గా జన్మించిందనడానికి తార్కాణమని డాక్టర్లు చెప్పారు. 

అరుదుగా కనిపించే ఇటువంటి వారిని ‘ఇంటర్‌సెక్స్‌’ గా పిలుస్తారు. అయితే గత పాతికేళ్లుగా అందరి అమ్మాయిల్లానే పింగ్‌ తన జీవితాన్ని గడిపింది. పింగ్‌ చిన్నవయసులో ఉన్నప్పుడు ఒకసారి అమె కాలి మడమకు గాయం అవ్వడంతో డాక్టర్లు ఎక్స్‌రే తీశారు. దానిలో ఎముకల ఎదుగుదల సరిగ్గా లేనట్లు గుర్తించారు. అయితే కొంతమందిలో నెమ్మదిగా ఎదుగుతాయని డాక్టర్లు చెప్పడంతో పింగ్‌ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మరోసారి పిరియడ్స్‌ కూడా సరిగ్గా రావడం లేదని గైనకాలజిస్టుకు చెప్పినప్పటికీ  కొందరికి రుతుక్రమం ఆలస్యం అవుతుందని చెప్పడంతో అప్పుడు కూడా ఆమె దానిని పెద్ద సమస్యగా తీసుకోలేదు. అయితే పురుషులలో సాధారణంగా కనిపించే ‘46 ఎక్స్, వై’ క్రోమోజోములు పింగ్‌లో ఉండడం వల్ల ఆమెలో ఉన్న జననేంద్రియాలు పురుషుడివా, స్త్రీవా అనేది స్పష్టంగా గుర్తించలేమని డాక్టర్లు చెప్పారు. 

పింగ్‌కు అందరి అమ్మాయిల్లా జననేంద్రియాలు ఉండడంతో ఎప్పుడూ ఆమెకు సందేహం రాలేదు. పింగ్‌ శరీరంలో గర్భాశయం కానీ అండాశయాలు ఏవీ లేవు. అందుకే పిరియడ్స్‌ కూడా రాలేదని ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేశారు. ఇది ఒప్పుకోలేని నిజమే అయినప్పటికీ ఇన్నేళ్ల తరువాత పింగ్‌ ఒక ఇంటర్‌సెక్స్‌ అని తెలియడం బాధాకరం.

చదవండి:
అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్‌ ట్విన్స్‌

మరిన్ని వార్తలు