వీళ్లేం తల్లిదండ్రులు.. పుట్టగానే కొడుకును అమ్మేశారు.. ఎందుకో తెలుసా?

22 Jan, 2022 15:13 IST|Sakshi

పుట్టగానే ఆ తల్లిదండ్రులు అతన్ని వేరే వాళ్లకు అమ్మేశారు. నాలుగేళ్లు గడిచాక ఆ పిలగాడిని దురదృష్టం వెంటాడింది. దత్తత తీసుకున్న జంట కూడా ఓ ప్రమాదంలో చనిపోవడంతో మళ్లీ అనాథ అయ్యాడు. గత్యంతరం లేక ఆ పెంపుడు తల్లిదండ్రుల బంధువుల ఇళ్లలో పెరిగి పెద్దయ్యాడు. గూడు చెదిరి పోవడంతో ఎగురుకుంటూ కన్నవాళ్ల చెంతకు చేరే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ బిడ్డకు భంగపాటే ఎదురైంది..

చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో ఉంటున్నాడు 17 ఏళ్ల లియు జుజౌ. బంధువుల ఇళ్లలో జీవనం కష్టమవుతుండడంతో.. మరో దారి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో తనకి అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలుసుకున్న లియు వారి కోసం వెతకడం ప్రారంభించాడు. 

ఎంత కాలం వెతికినా ప్రయోజనం లేకపోయింది. దారులు ఇరుకు అవుతున్న క్రమంలో.. ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఆపై ఇంటి పేరు ఆధారంగా.. ఎలాగోలా కన్నతండ్రిని కనిపెట్టగలిగాడు. 21 డిసెంబర్‌ 2021లో లియు.. తన తండ్రిని కలిశాడు.  కానీ, అక్కడ అతనికి  ట్విస్ట్‌ ఎదురైంది. లూయు తన కొడుకే కాదని డింగ్ షుంజిక్కులన్ బయటికి పొమ్మన్నాడు. దీంతో పోలీసుల సహకారంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా లియు.. డింగ్‌ కుమారుడే అని తేలింది. కథలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. డింగ్‌తో ఉంది లియు కన్నతల్లి కాదు. 

తన భార్యకు(లియు కన్నతల్లి).. ఆమె ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వడానికే పుట్టిన బిడ్డను(లియు) అమ్మేసినట్లు డింగ్‌ ఒప్పుకున్నాడు. లియుని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకుని ఆ జంట విడాకులతో వేరు పడింది. కొంతకాలానికి మళ్లీ వివాహం చేసుకుని వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పేరెంట్స్ దరిద్రపుగొట్టు ప్లాష్‌బ్యాక్‌ గురించి తెలిశాక లియు ఛీ అనుకున్నాడు.

ఆపై కన్నతల్లిని వెతుక్కుంటూ వెళ్లాడు లియు. కొడుకుని సాదరంగా హత్తకున్న తల్లి.. కొడుకు వినిపించిన డిమాండ్‌ విని షాక్‌ తింది. తనకు ఇల్లు లేదని, సాయం చేయాలని కోరాడు ఆమెను. ఆమె దానికి నిరాకరించింది. దీంతో కన్నవాళ్లను ఒక దగ్గరికి చేర్చి పంచాయితీ పెట్టాడు లియు. తనకు ఇల్లు కట్టించి తీరాల్సిందేనని లియు డిమాండ్‌ చేయగా.. చదువుకోవడానికి ఫీజులు చెల్లిస్తామని, బతకడానికి కొంత డబ్బు ఇస్తానని ఆ తండ్రి మాత్రం అంగీకరించాడు. దీంతో లుయు కొర్టుకెక్కాడు. తనకు కోర్టులో న్యాయం జరుగుతందని ఆశిస్తున్నాడు. తనను పెంచుకున్న తల్లిందండ్రులు ఇచ్చిన ఇల్లు మొత్తం శిధిలావస్థలో ఉ‍ందని, కనీసం దానిని బాగు చేసిచ్చినా చాలని అంటున్నాడు పాపం లియు.  

మరిన్ని వార్తలు