సీఐఏ తొలి సీటీఓగా మూల్‌చందానీ

2 May, 2022 00:18 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్‌ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్‌ విలియమ్‌ జె.బర్న్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

ఢిల్లీ స్కూల్‌లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్‌ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్‌ అన్నారు. సీఐఏలో స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని మూల్‌చందానీ అన్నారు.
 

మరిన్ని వార్తలు