చైనా బొగ్గు గని ప్రమాదంలో 14 మంది మృతి

7 Mar, 2022 08:15 IST|Sakshi

బీజింగ్‌: నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో బొగ్గు గని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది మరణించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. సాన్హే షంగ్జన్‌ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న పై కప్పు కూలిపోవడంతో అక్కడే  పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సహాయ సిబ్బందిని రంగంలోకి దించారు. వారం రోజులు సహాయ కార్యక్రమాలు నిర్వహించాక  14 మంది మృతదేహాలు బయటపడ్డాయి. చైనాలో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో మరణాల సంఖ్య తగ్గాయి. 

(చదవండి: ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం)

మరిన్ని వార్తలు