భావోద్వేగం: అద్దాలు పెట్టుకోగానే అవాక్కయ్యాడు..

9 Jan, 2021 15:53 IST|Sakshi

లండన్‌: మొదటిసారిగా తన చూట్టు ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. అదేంటి మొదటి సారి రంగులు చూడటమేంటని షాకవుతున్నారా. అసలు విషయం ఏంటంటే.. యూకేకు చెందిన మోకిన్లీ మాక్‌(22) పుట్టుకతోనే కలర్‌ బ్లైండ్‌. ఈ నేపథ్యంలో మాక్‌ ఫ్రెండ్స్‌ అతడికి కలర్‌ బ్లైండ్‌ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో మాక్‌ ఆ కళ్లద్దాలను పెట్టుకుని చూశాడు. దీంతో తన ఎదురుగా రంగురంగుల కార్లు, పచ్చని చెట్లు, రంగుల ఇళ్లను చూసి అతడు ఒక్కసారిగా షాక్‌కు ‌గురయ్యాడు. తన చూట్టు ఇంతటి అందమైన రంగుల ప్రపంచం ఉంటుందా అని తెలుసుకున్న మాక్‌ పట్టనంత ఆనందంతో ఉక్కిరిబిక్కయ్యాడు. ఇదంతా అతడి స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లలో బందించారు. (చదవండి: 100 రోజులు ఒకే డ్రెస్‌ వేసుకుంది.. కారణం)

అనంతరం ఈ వీడియోను మాక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 2 మిలియన్‌లకు పైగా వ్యూస్‌, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. మాక్‌ పట్టనంత సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్‌లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘ఇది చూసి నాగుండె బరువెక్కింది’, ‘ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో  చూసే వారికి మీరు ఆదర్శంగా నిలిచారు.. నిజంగా మీ ఆనందానికి అవదులు లేవు’, ‘అసలైన రంగుల ప్రపంచాన్ని చూస్తునందుకు సంతోషం. మీకు నిజంగా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారి ఎప్పుడు అలాగే ఉంచుకోండి’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ చేస్తున్నారు. (చదవండి: స్టార్‌ హీరోయిన్‌ క్యూట్‌ ఫొటో, కామెంట్ల వెల్లువ)

A post shared by Mac (@maciavelli_)

మరిన్ని వార్తలు