రద్దీ మార్కెట్‌లో కరెంట్‌తీగలు తెగిపడి.. 26మంది దుర్మరణం

3 Feb, 2022 14:12 IST|Sakshi

మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్‌లో హై వోల్టేజ్‌ కేబుల్‌ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్‌షాసా శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్‌ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్‌ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని వార్తలు