ప్రముఖ వెబ్‌సైట్ల సర్వర్‌ డౌన్

8 Jun, 2021 17:26 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డిట్ , స్పాటిఫై , ట్విచ్, ఫైనాన్షియల్ టైమ్స్ , ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ వంటి ప్రముఖ వెబ్‌సైట్లకు ఇంటర్నెట్‌ సమస్య తలెత్తింది. దీంతో భారత్‌ సహా పలు దేశాల్లో ఈ సైట్ల సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్‌ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తుంది.

ప్రముఖ సీడిఎన్ సర్వీస్ ప్రొవైడర్ తన వెబ్‌సైట్‌లో తన సేవల విషయంలో సమస్య ఎదుర్కొన్నట్లు సంస్థ మంగళవారం సాయంత్రం 4:14 గంటలకు తన వెబ్‌సైట్‌లో రాసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ ఇంక్. తో సహ ఇతర ప్రముఖ హులు, కోరా, హెచ్బిఓ మాక్స్, ది గార్డియన్‌ వంటి వాటి సేవల విషయంలో అవాంతరం ఎదుర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. అయితే, ప్రస్తుత సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇక్కడ చదవండి: ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్

BGMI క్రాఫ్టన్‌కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ

మరిన్ని వార్తలు