అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి

13 Mar, 2021 15:13 IST|Sakshi

 నో కల్చర్‌ ..నో ఫ్యూచర్‌ 

పారిస్‌: 'ఫ్రెంచ్ ఆస్కార్' వేడుకలో అనూహ్య పరిణామం సభికులను ఒక్కసారిగా షాక్‌కు గురి  చేసింది.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో సంస్కృతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తూ నటి కోరిన్ మాసిరో (57) నగ్నంగా మారిపోయారు.  సీజర్ అవార్డుల వేడుక సందర్బంగా శుక్రవారం ఈ సంచలన నిరసనకు కోరిన్‌ దిగారు.   

ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే వేదికపైకి ఉత్తమ దుస్తులకు అవార్డును అందజేయడానికిమాసిరోను ఆహ్వానించారు. ఈ సమయంలో రక్తంతో తడిసిన గాడిదను పోలిన దుస్తులతో వచ్చారు. వేదికపై మాట్లాడుతూనే పూర్తిగా నగ్నంగా మారిపోతున్నానంటూ ప్రకటించి అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్‌లో "సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు"  అనే నినాదంతో ఆమె దర్శనమిచ్చారు. ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం  చేశారు. అలాగే  ‘మా కళను మాకు తిరిగి ఇవ్వండి... జీన్‌’ అంటూ బాడీ అంతా  రాసుకొని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు  విజ్ఞప్తి చేయడం విశేషం.

కాగా కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా మూడు నెలలకు పైగా ఫ్రాన్స్‌లో సినిమాలు మూతపడ్డాయి. గత డిసెంబరులో, వందలాది మంది నటులు, థియేటర్ డైరెక్టర్లు, సంగీతకారులు, ఫిల్మ్ టెక్నీషియన్లు, క్రిటిక్స్‌  అనేక మంది  సాంస్కృతిక కేంద్రాల మూతకు వ్యతిరేకంగా పారిస్ , ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు